Friday, December 17, 2010

నేటి ముక్కోటి ఏకాదశి ప్రత్యేకత


నేడు వైకుంఠ ఏకాదశి పర్వదినం.నేడు వైకుంఠ ద్వారం తెరుచుకుంటుందని దాని ద్వారా  విష్ణు దర్శనం చేసుకుంటే మోక్షం కలుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి.ప్రతినిత్యం ముక్కోటి దేవతలు బ్రహ్మముహూర్తకాలంలో ఉత్తర ద్వారం ద్వారా శ్రీహరి ని దర్శించుకుంటారు.ముక్కోటి ఏకాదశి నాడు మాత్రం మానవులకు కూడా ఉత్తర ద్వారం ద్వారా స్వామి వారిని దర్శించుకునే వీలుంటుంది.ఈ సంవత్సరం ముక్కోటి ఏకాదశికి మరో ప్రత్యేకత కూడా ఉంది.అది శుక్రవారం రావడం.ప్రతీ శుక్రవారం తిరుమల లో శ్రీవారి నిజ రూప దర్శనం ఉంటుంది.ఈ ముక్కోటి ఏకాదశి నాడు వైకుంఠ ఉత్తర ద్వారం  ద్వార స్వామి వారి నిజరూప దర్శనం చాలా ప్రత్యేకమైనది కావున భక్తులందరూ స్వామి వారిని సేవించి శ్రీహరి కృపకు పాత్రులుకాగలరని మనవి.

1 comment:

  1. గోవిందాశ్రిత గొకులనందా ! పావనజయజయ పరమానందా!

    ReplyDelete