Thursday, December 23, 2010

సంతాన లేమి-పరిష్కారమార్గం


నేడు అనేక మంది సంతాన లేమితో బాధపడుతున్నారు.సంతాన లేమికి నివాసగృహ వాస్తుదోషం కూడా కారణం కావొచ్చు.జ్యోతిష్యశాస్త్ర రిత్యా గురుడు పుత్రకారకుడు..మరియు వాస్తు రిత్యా గృహ ఈశాన్యానికి గురుడు అధిపతి..కావున నివాసగృహ ఆవరణ ఈశాన్యం మిగిలిన దిక్కులకంటే ఎత్తైనా,ఈశాన్య స్థలం తగ్గిననూ ఈశాన్యం ఖాళీ లేకపోయిననూ ఆ గృహములో నివసించువారికి సంతాన విషయంలో,ఆరోగ్యరిత్యా సమస్యలు ఎదురౌతాయి.అందువల్ల గురు గ్రహ సంబంధమైన జపహోమాలు చేయడం వల్ల వాస్తుదోష నివారణ జరుగుతుంది.
                                                                                              -మంధా.వెంకటసూర్యనారాయణ శర్మ  

Monday, December 20, 2010

యువతరం రాజకీయాలు -జ్యోతిష్య విశ్లేషణ


నేడు దేశమంతా యువమంత్రం జపిస్తోంది.125 సంవత్సరాల చరిత్రకలిగిన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ వైపు ఆశగా చూస్తోంది.భావి ప్రధాని రాహులేనంటూ బహిరంగంగా ప్రకటిస్తోంది.అదే స్పూర్తితో బీజేపీ కూడా వాజ్ పేయ్,అద్వానీ వంటి వారిని పక్కకి జరిపి సుష్మాస్వరాజ్,అరుణ్ జైట్లీ,నరేంద్రమోడీ,గడ్కరీ,వరుణ్ గాంధీ వంటి యువనేతలను తెరపైకి తెస్తోంది.అలాగే లెఫ్ట్ పార్టీలు కూడా ప్రకాష్ కారత్ వంటి యువనాయకుల నాయకత్వంలో నడుస్తున్నాయి.నేడు యువత అన్ని రంగాల్లోనూ దూసుకుపోతోంది.అలాగే రాజకీయ రంగంలోనూ.ఇంతకుముందు రాజకీయాలంటే వెనకడుగు వేసే యువకులు ఇప్పుడు రాజకీయాల పట్ల ఆసక్తి చూపుతున్నారు.చేంజ్ అంటూ ఒబామా ఇచ్చిన స్ఫూర్తితో యువత ముందుకు కదులుతున్నారు. మన రాష్ట్రంలో కూడా యువకుడైన కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.అలాగే యువకుడైన జగన్ రాష్ట్ర రాజకీయాలలో కీలకపాత్ర పోషిస్తున్నాడు.అలాగే అన్ని సంఘాలు,అసోసియేషన్లను యువకులే నిర్వహిస్తున్నారు.కొంతమందిలో పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలను గుర్తించవచ్చు.అలాగే మరికొంత మందిలో ఆయా పరిస్థితులను బట్టి నాయకత్వ లక్షణాలు బయటపడతాయి.మనలో నాయకత్వ లక్షణాలను గుర్తించి మెరుగుపర్చుకున్నట్లయితే మంచి నాయకుడిగా తయారుకావొచ్చు.జ్యోతిష్య శాస్త్ర పరంగా నాయకత్వ లక్షణాలను సులభంగా గుర్తించవచ్చు.జ్యోతిష్యపరంగా యువ నాయకులకు ఉండవలసిన ప్రధాన బలం గ్రహాల అనుకూలత.వీటిలో ప్రధానమైనవి 4.
1)గురుడు-జ్ఞానానికి కారకుడు
2)శని-ప్రజాదరణ కారకుడు
3)కుజుడు -భుజబలకారకుడు
4)రాహువు-మాయతో మర్మంతో అందరి మన్నన పొందడానికి కారకుడు..
.ఎంతటి నాయకులకైనా ప్రజాదరణ ముఖ్యం..అటువంటి ప్రజాదరణకు కారకమైనది శని .కొన్ని సార్లు ఎంతగా ప్రయత్నించినా ఎన్ని మంచిపనులు చేసినా ప్రజాదరణ లభించకపోవచ్చు దానికి కారణం ఆ గ్రహా బలం తగ్గడం..ఆయా గ్రహాలను బట్టి సరైన రెమిడీలు పాటించినట్లైతే గొప్ప నాయకులుగా గుర్తింపుపొందే అవకాశముంది.పైన చెప్పిన నాలుగు గ్రహాలలో ఏ గ్రహబలం తగ్గినా లేదా బలహీనంగా ఉన్నా,నీచ స్థానంలో ఉన్నాయువనాయకుల ఆలోచనలలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.అందువల్ల యువనాయకులు పైన చెప్పిన ఏ బలం తగ్గిందని భావన కలిగినా ..ఆ గ్రహా సంబంధమైనపరిహారాలను చేసినట్టైతే తప్పక మార్పు కనిపిస్తుంది. ఇది చాలా అవసరం ఒక్కసారి ప్రయత్నించి చూడండి.మంచి ఫలితాలను మీరే పొందుతారు.
            
  .నేటి యువకులే రేపటి నాయకులు ..దేశాన్నినడిపించేది నాయకులే కాబట్టి అటువంటి యువనాయకులు సమర్థులైతే దేశం సస్యశ్యామలమౌతుంది.కాబట్టి .అటువంటి యువకులకు జ్యోతిష్యపరంగా కొన్ని సూచనలు ఇవ్వడం మంచిదని భావిస్తున్నాను.


             -మంధా వెంకట సూర్యనారాయణశర్మ

Saturday, December 18, 2010

సంతానలేమి-వాస్తుదోష నివారణ


నేడు అనేక మంది సంతాన లేమితో బాధపడుతున్నారు.సంతాన లేమికి నివాసగృహ వాస్తుదోషం కూడా కారణం కావొచ్చు.జ్యోతిష్యశాస్త్ర రిత్యా గురుడు పుత్రకారకుడు..మరియు వాస్తు రిత్యా గృహ ఈశాన్యానికి గురుడు అధిపతి..కావున నివాసగృహ ఆవరణ ఈశాన్యం మిగిలిన దిక్కులకంటే ఎత్తైనా,ఈశాన్య స్థలం తగ్గిననూ ఈశాన్యం ఖాళీ లేకపోయిననూ ఆ గృహములో నివసించువారికి సంతాన విషయంలో,ఆరోగ్యరిత్యా సమస్యలు ఎదురౌతాయి.అందువల్ల గురు గ్రహ సంబంధమైన జపహోమాలు చేయడం వల్ల వాస్తుదోష నివారణ జరుగుతుంది.
                                                                                              -మంధా.వెంకటసూర్యనారాయణ శర్మ  

Friday, December 17, 2010

నేటి ముక్కోటి ఏకాదశి ప్రత్యేకత


నేడు వైకుంఠ ఏకాదశి పర్వదినం.నేడు వైకుంఠ ద్వారం తెరుచుకుంటుందని దాని ద్వారా  విష్ణు దర్శనం చేసుకుంటే మోక్షం కలుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి.ప్రతినిత్యం ముక్కోటి దేవతలు బ్రహ్మముహూర్తకాలంలో ఉత్తర ద్వారం ద్వారా శ్రీహరి ని దర్శించుకుంటారు.ముక్కోటి ఏకాదశి నాడు మాత్రం మానవులకు కూడా ఉత్తర ద్వారం ద్వారా స్వామి వారిని దర్శించుకునే వీలుంటుంది.ఈ సంవత్సరం ముక్కోటి ఏకాదశికి మరో ప్రత్యేకత కూడా ఉంది.అది శుక్రవారం రావడం.ప్రతీ శుక్రవారం తిరుమల లో శ్రీవారి నిజ రూప దర్శనం ఉంటుంది.ఈ ముక్కోటి ఏకాదశి నాడు వైకుంఠ ఉత్తర ద్వారం  ద్వార స్వామి వారి నిజరూప దర్శనం చాలా ప్రత్యేకమైనది కావున భక్తులందరూ స్వామి వారిని సేవించి శ్రీహరి కృపకు పాత్రులుకాగలరని మనవి.

Wednesday, December 15, 2010

యువనేత జగన్ జాతక విశ్లేషణ


గోచార రిత్యా మిధునంలో ఉన్న చంద్రుడి యొక్క దృష్టి సప్తమిలో ఉన్న కుజుడి మీద పడడం అదే విధంగా ధనుస్సులో ఉన్న కుజుడి యొక్క విశేష దృష్టి మీనంలో ఉన్న గురుడి మీద పడడం వలన చంద్ర మంగళ యోగం,గురు మంగళ యోగాన్ని కలిగే విశేషమైన ఫలితం జగన్ జాతకంలో ఆరంభమౌతోంది.ఏదేమైనప్పటి జనవరి 6 తర్వాత జగన్ జీవితంలో మంచి మార్పులు కనబడుతాయి.
                                                                               - మంధా వెంకట సూర్యనారాయణ శర్మ

కాంగ్రెస్ తిరోగమనం-జగన్ పురోగమనం


ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్(ఐ) స్థాపించబడిన తేదీ02.01.1978 ఉదయం 9.గంలకు.న్యూఢిల్లీలో.కాంగ్రెస్ స్థాపితమైన తేదీ రిత్యాదాని జాతకం బలహీన పడడం.. అదేసమయంలో జగన్ కాంగ్రెస్ ని వీడి బయటపడడం జరిగింది.ఇదే సమయంలో గురుడు మీన రాశి లోకి వచ్చి స్థిరపడడం..అలా స్థిరపడిన గురుడు  శుభదృష్టి సప్తమభావంలో కన్యాలగ్నం(జగన్)పై పడడంతో రాజకీయంగా జగన్ కి బలం పెంచుతుందని చెప్పవచ్చు..
                                                                 జగన్ జాతకం పై మరింత విశ్లేషణ తరువాతి టపాలో

Tuesday, December 14, 2010

క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఏంచేయాలి..?

మానవశరీరంలోక్యాన్సర్ నివారణకు మన వేదాలలో అనేక పరిహారాలు చెప్పబడ్డాయి.మంత్రశాస్త్రంలో కూడా అనేక నివారణోపాయాలు చెప్పి ఉన్నారు.జ్యోతిష్యశాస్త్ర రిత్యా క్యాన్సర్ వ్యాధి  సోకిన ప్రదేశం విషపూరితం కావడానికి రాహు గ్రహం ప్రధాన పాత్ర పోషించడం కనిపిస్తుంది.కాబట్టి నిత్యం రాహుగ్రహ జపం లేదా రాహుగాయత్రి స్తోత్రం జపించిన..ముందు ముందు వారికి క్యాన్సర్ వ్యాధి సోకే అవకాశం ఉండదని చెప్పవచ్చు.
                                                                                                                     -మంధావెంకటసూర్యనారాయణశర్మ

Monday, December 13, 2010

జ్యోతిర్వైద్యం-పక్షవాతం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి..?

మానవశరీరంలో పక్షవాతం అనునది వాత దోషము వలన ఏర్పడు తీక్షణమైన వ్యాధి.శరారంలో రక్తప్రసరణ వ్యవస్థకు ఆటంకం కలుగడం వలన పక్షవాతం వస్తుంది...జ్యోతిష్యశాస్త్ర ప్రకారం నరాలకి అధిపతి బుధుడు కాబట్టి ఈ వ్యాధి కారక గ్రహం బుధుడు.

దీంతో జ్యోతిష్యపరంగా నిత్యం విష్ణుసహస్రనామం చేస్తున్నవారికి పక్షవాతం రాకుండా ఆ కారక గ్రహం (బుధుడు) కాపాడుతాడని చెప్పవచ్చు.
                 -మంధా వెంకటసూర్యనారాయణశర్మ

Sunday, December 12, 2010

జ్యోతిర్వైద్యం-మేధస్సు పెరగాలంటే ఏంచేయాలి?


మన శరీరంలో కమ్యూనికేషన్స్ వేగంగా జరుగుతూ ఉంటాయి.దీనికి నెర్వస్ సిస్టమ్ ప్రధానంగా ఉపయోగపడుతుంది.సమాచారాన్ని మొదడుకు చేర్చడం నిర్ణయాలను తీసుకోవడం దీని ప్రధాన కర్తవ్యాలు.శరీరమంతటా కణజాలాల ద్వారా ఆహారాన్ని ఆక్సీజన్ ని ,కావల్సిన అన్ని పదార్థాలను అందజేయడంలో ఈ వ్యవస్థ యొక్క గొప్పదనం ఉంటుంది.శరీరానికి వేగం కూడా ఈ వ్యవస్థ వల్లనే వస్తుంది.

జ్యోతిష్యపరంగా బుధుడుఈ విభాగానికి (నర్వస్ సిస్టమ్) అధిపతి కాబట్టి బుధగ్రహ సంబందమైన స్తోత్రం చేయడం వల్ల మేధస్సు పెరుగుతుంది.
                                      -మంధావెంకటసూర్యనారాయణశర్మ

                                                                                                                  

Saturday, December 11, 2010

జ్యోతిర్వైద్యం-సంతాన యోగం కలగాలంటే ఏంచేయాలి..?


ఉత్పాదక శక్తికి ,సృజనాత్మక శక్తి కి కారకుడు గురుడు..నిర్మాణాత్మక శరీర ప్రక్రియ లన్నింటికీ కారకుడు గురుడే..స్త్రీ పురుషుల కలయిక తర్వాత ఏర్పడే జైగోట్ వెంటనే విభజన చెందడం మొదలుపెడుతుంది.అతి వేగవంతమైన విభజనల ద్వారా 9మాసాల్లో ఆ బీజం మానవకృతి దాల్చి వెలుపలకు వస్తుంది.


జ్యోతిష్యపరంగా గురుడు సంతానకారకుడు కాబట్టి గురుగ్రహబలాన్ని మంత్ర సాధన ద్వారా పెంచుకోగల్గితే సంతానయోగం కలుగుతుంది.
                                         -మంధావెంకటసూర్యనారాయణశర్మ

Friday, December 10, 2010

జ్యోతిర్మయం-మనోమయం-1

జ్యోతిర్వైద్యం అనే పదం ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.వైద్యజ్యోతిష్యం,జ్యోతిర్వైద్యం కొంత తేడాతో కనిపిస్తున్నాయి.రోగం వచ్చిన తర్వాత నివారించే విధానం వైద్యజ్యోతిష్యంలో కనిపిస్తుంది.రోగం వచ్చే అవకాశాలను జ్యోతిష్య సూత్రాల రిత్యా జాతకపరిశీలనా మాద్యమంగా దృష్టిలో ఉంచుకొని ఆయా ప్రత్యేక సమయాలలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ జీవనవిధానాన్ని మార్చుకునే విధానమే జ్యోతిర్వైద్యంగా చెప్పబడుతోంది.

ఉపనిషత్తులు కూడా శరీరమనే రధానికి ఆత్మరధి అని,బుద్ది సారధి అని,ముందున్న ఐదు గుర్రాలు పంచేంద్రియాలు,ఇంద్రియాలను అదుపులో ఉంచే పగ్గాలు మనస్సు.బుద్ది తన విశ్లేషణా శక్తితో,ఆత్మ యొక్క ఆదేశ మేరకు మనస్సును అదుపులో పెట్టుకుని ఇంద్రియాలనే గుర్రాలను జాగ్రత్తగా అధిలిస్తూ శరీరమనే రధాన్ని నడిపిస్తే జీవన లక్ష్యాన్ని గమ్యాన్ని సరైన సమయంలో సరియైన విధంగా చేరగలిగే అవకాశాన్ని ఇచ్చిన వారవుతాం..అందువల్ల మనస్సు అన్నింటికీ కీలకమైనది.


జ్యోతిష్యపరంగా మనోకారకుడైన వాడు చంద్రుడు అటువంటి చంద్ర గ్రహ సంబంధమైన జపం ధ్యానం చేయడంవల్ల జీవిత గమ్యం చేరగలుగుతాం..
                                                           -మంధా వెంకట సూర్యనారాయణ శర్మ

Wednesday, December 8, 2010

జ్యోతిర్వైద్యం

ఐశ్వర్యం ఈశ్వరాధిచ్చేత్
ఆరోగ్యం భాస్కరాధిచ్చేత్
పూర్వజన్మకృతం పాపం వ్యాధిరూపేణపీడితం
తచ్ఛాన్తి రేషధైర్థానై జపహోమ: సురార్చనై:

తాత్పర్యం:
సకల ఐశ్వర్యములు ఈశ్వర ఆధీనం ,ఆరోగ్యం సూర్యుని ఆధీనం,పూర్వజన్మలో చేసిన పాపములు రోగములద్వారా అనుభవించవలసి ఉంటుంది.వీటిని రూపుమాపుటకు ఔషద సేవనం ,దానం జపం ,హోమం.సురార్చనము యోగ దాయకములు.

మంచి మాట- అహం నశించనిదే  మోక్షం కలుగదు

ఈ రోజు రాశిఫలాలు

బుధవారం(08-12-2010)


శ్రీ వికృతినామ సం.రం,దక్షిణాయనం;
హేమంత రుతువు,మార్గశిర మాసం ,శుక్లపక్షం
తిథి-విదియ రా.10.36ని.లవరకు
నక్షత్రం-పూర్వాషాడ రా.7.52 ని.
వర్జ్యం-ఉ 6.36 ని.వరకు
దుర్ముహూర్తం-ఉ-11.30 నుంచి12.14 వరకు
అమృత ఘడియలు-పగలు 2.54 నుంచి 3.45వరకు
రాహుకాలం- -మ-12.00నుంచి1.30వరకు
.
-రాహుగ్రహ జపం చేయండి స్థిరాస్తి వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి.















Monday, December 6, 2010

ఈ రోజు రాశిఫలాలు

మంగళవారం(07-12-2010)


శ్రీ వికృతినామ సం.రం,దక్షిణాయనం;
హేమంత రుతువు,మార్గశిర మాసం ,శుక్లపక్షం
తిథి-విదియ రా.10.16ని.లవరకు
నక్షత్రం-మూల రా.7.02 ని.
వర్జ్యం-సా.5.24 నుండి 7.03 ని.
దుర్ముహూర్తం-ఉ-8.33 నుంచి9.17 వరకు
                      -రా-10.33నుంచి11.25వరకు
అమృత ఘడియలు-పగలు 12.32 నుంచి 1.22వరకు
రాహుకాలం- -మ-3.00నుంచి4.30వరకు
.
-ఈ రాశి వారు ఆదిత్యహృదయం పఠించి ముందుకు వెళితే కార్యసిద్ది కలుగుతుంది.